Creative works from Telusuna Members

Prema Lekha

Durga Prasad Varanasi

ప్రేమ లేఖ

దుర్గాప్రసాదు వారణాసి
(26 ఫిబ్రవరి 2008)

[ఉపోద్ఘాతం: మా ఆవిడ జూలై 1981 లో తన తమ్ముడి పెళ్ళికి కర్నూలు వెళ్ళింది. నేను నిరంతర నిర్విరామ భూగోళ వాతావరణ పరిశోధణా వ్యవస్తలో నిమగ్నుడనై
సతీమణి వెంట వెళ్ళ లేక పోయాను. తను మా పిల్లలిద్దరినీ వెంట తీసుకుని వెళ్ళింది. అప్పుడు విరహ బాధలో రచియించిన ఈ చిన్న ప్రేమలెఖను చిత్తగించండి. తను తిరిగి వచ్చాక నన్ను మందలించింది. ఏ విధంబుగానంటే వినండి: “దేవులపల్లి కృష్న శాస్త్రి గారు అన్నట్లుగా: “ఇంత లేటు వయసులో ఇంత మోటు మోహములో!”

ఆ శాస్త్రిగారు చమత్కరించినది “పాతాళ భైరవి” అనే చలన చిత్రములో పింగళి నాగేంద్ర రావు వ్రాసిన పాట ,

“ఎంత ఘాటు ప్రేమయో, ఎంత తీవ్ర వీక్షనమో,
ఎంత లేత వలపులో, ఎంత చాటు మోహములో”

గురుంచి.

ఆ పాటను విమర్శిస్తూ కృష్న శాస్త్రి గారు, శ్రీ శ్రీ గారు ఆ విధముగా చమత్కరించారుట!

I was only forty three in 1981! ఇదంతా వృద్ధాప్యంలోని వృధా ప్రసంగం!!]

చ్క్షప్పగ దోచు భక్ష్యములు చ్క్షల్లని గాలి చిరాకు నిచ్చు, ని
న్నెప్పుడు జూతునో యనుచు నిత్యము చింతనలో మునింగి, క
న్నెప్పుడు మూయలేక నిశియే పవలాయెననంగ, లేఖలో
చెప్పగలేను నా హృదయ సీమను చీల్చెడు బాధ మాలతీ!



#prEma lEkha

durgAprasAdu vAraNAsi
(26 phibravari 2008)

[upOdghAtam: mA AviDa joolei 1981 lO tana tammuDi peLLiki karnoolu veLLindi. nEnu niramtara nirvirAma bhoogOLa vAtAvaraNa pariSOdhaNA vyavastalO nimagnuDanei
satImaNi vemTa veLLa lEka pOyAnu. tanu mA pillaliddarinI venTa tIsukuni veLLindi. appuDu viraha bAdhalO raciyimcina I cinna prEmalekhanu cittagimcamDi. tanu tirigi vaccAka nannu mandalimcimdi. E vidhambugAnamTE vinamDi: “dEvulapalli kRshna SAstri gAru annaTlugA: “imta lETu vayasulO inta mOTu mOhamulO!”

A SAstrigAru camatkarimcinadi “pAtALa bhairavi” anE calana citramulO pingaLi nAgEndra rAvu vrAsina pATa ,

“enta ghATu prEmayO, enta tIvra vIkshanamO,
enta lEta valapulO, enta cATu mOhamulO”

gurumci.

A pATanu vimarSistoo kRshna SAstri gAru, SrI SrI gAru A vidhamugA camatkarimcAruTa!

#I was only forty three in 1981!# idamtA vRddhApyamlOni vRdhA prasamgam!!]

cxappaga dOcu bhakshyamulu cxallani gAli cirAku niccu, ni
nneppuDu jootunO yanucu nityamu cimtanalO munimgi, ka
nneppuDu mooyalEka niSiyE pavalAyenanamga, lEkhalO
ceppagalEnu nA hRdaya sImanu cIlceDu bAdha mAlatI!
#

Back to list