పల్లవి. కొండల దొర మమ్ము క్రీగంట జూడ, నిండుగ మా బ్రతుకు నవ్వులతో సాగు. ||కొండల|| అనుపల్లవి. అండగ ఆ దొర చెంతన ఉండ, పండువగ మా జన్మ పూర్తిగ సాగు. ||కొండల|| 1. అలమేలు వల్లభుడు కై దండ గుండ అలతలు లేకుండ హాయి సమకూరు, కలువ కన్నుల వాడి కరుణ మా పై నుండ, వెల్లువుగ యీ జన్మ వెన్నెలగ మారు. ||కొండల|| 2. శ్రీలక్ష్మి నాధుడి రక్ష సమకూర, కలకాలము బ్రతుకు కమ్మగా సాగు, వలరాయుని తండ్రి వలపు చేకూర చల్లగ యీ బ్రతుకు చక్కగా సాగు. ||కొండల|| 3. వర వేంకటా పతి వరము లీయంగ నర జన్మ సుఖములతో నిండుగ సాగు, కరి రాజ వరదుని కను చూపు తగల తరి యించి మా బ్రతుకు తృప్తిగా సాగు. ||కొండల|| రమాకాంతరావు చాకలకొండ February 11, 2008 |
#maa telugu talliki mallepU daMDaa# |