ఈశ్వరి, జగదీశ్వరి, భువనేశ్వరి రావే! విశ్వ జనని, మోహిని, వరదాయని రావే! ||ఈశ్వరి|| 1. దాస జనులకు బాసటై, దయ నేలు తల్లివి నీవే! ఆశ తీర్చే అమృత వల్లి, అలమేలు మంగ రావే! ||ఈశ్వరి|| 2. కనక మాలా భూషిణి, కల్యాణీ, కరుణ సాగరి! వనజ వాసిని, వేంకటేశ్వరి, విశ్వమాతవు నీవే! ||ఈశ్వరి|| 3. దయ, ధర్మ రూపిణి, దివ్య వర ప్రసాదిని జయములిచ్చే జననివి, జగదేక మాతవు నీవే! ||ఈశ్వరి|| 4. క్షీర సాగర వాసిని, శ్రీ రంగ క్షేత్ర నివాసిని! సిరుల తేలే, తిరుమలేశ్వరి, శరణము యిక నీవే! ||ఈశ్వరి|| రమాకాంతరావు చాకలకొండ 13 ఫిబ్రవరి 2008 |
#maa telugu talliki mallepU daMDaa# |