Creative works from Telusuna Members

ఆకలుండిన నాడు అందదే తిండి ?

రమాకాంతరావు చాకలకొండ

పల్లవి. ఆకలుండిన నాడు అందదే తిండి ?
అన్ని వున్నను నేడు అరగదే తిండి! ||ఆకలుండిన||

అనుపల్లవి. యిచ్చెడి వాడికి ఎంత దయ లేదండి?
యిచ్ఛ వచ్చిన రీతి వ్రాయు రాతండి? ||ఆకలుండిన||

1. కావాలి అనకొన్న కలసి రాదండి,
చేవ చచ్నిన నేడు చేచిక్కు నండి,
యావ ఉన్న నాడు యాశగానే ఉండి,
నవత లేని నేడు నింట చేరేనండి. ||ఆకలుండిన||

2. మనసు పడిన నాడు మమతలే దొరకక,
మనుగడ భారమై మదికి పడె గండి,
అనువుగా సమకూరి ఆన్ని దరిలోనుండ
తనువులో ధాడ్యము తరగి పోయే నండి. ||ఆకలుండిన||

3. చేవ ఉన్న నాడు చిల్లుగాని లేక
భావనలు ఊహలుగ మిగిలెను ఎండి,
సేవ భావన లేక, శక్తి ఉండి నేడు, ఆశ
దావానలమై అడ్డుపడె నండి. ||ఆకలుండిన||

4. కోర్కెలున్న నాడు కలిమి లేదండి,
సిరి పట్టిన నేడు క్షమత లేదండి,
తిరువేంకటేశుని తెలియ రాని మాయ!
చేరువై చిత్తమున చల్ల యగు నండి! ||ఆకలుండిన||

రమాకాంతరావు చాకలకొండ February 14, 2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list