Creative works from Telusuna Members

శివరాత్రి నేడే --- శ్రీశైల మల్లీస! శితి కంఠా!

రమాకాంతరావు చాకలకొండ

శ్రీశైల మల్లీస! శితి కంఠా!
బాసట ఉండయ్య మా వెంట! || శ్రీశైల||

1. భవపాస నాశ, భక్త మందార
శివ శివ, శ్రీకంఠ! సర్ప సుమహార,
హర హర, శ్రమ హార, భవ భయ దూర,
గౌరి హృద్ వాస, గరళ కంఠా! || శ్రీశైల||

2. భక్తులు భావించు కొంగు బంగారమా!
శక్తి వామ ధర, శ్రీ శైల వాస,
ముక్తి నిచ్చే దొర, మా మహేశ!
రక్తిగ నిను కొలుతు రామేశ! || శ్రీశైల||

3. గంగ జఠా ధర, గజ చర్మ భూష!
లింగ!హర! శివ!లావణ్య వేష!,
శంకర, శుభకర! కరుణాంత రంగ
అంగాంగ పూజలివే, గొనుము ఒనరంగ! || శ్రీశైల||

రమాకాంతరావు చాకలకొండ Thursday, March 06, 2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list