Creative works from Telusuna Members

కోపము సమకూరు కార్యములు చెఱచును

రమాకాంతరావు చాకలకొండ

కోపము సమకూరు కార్యములు చెఱచును ,
కోపము తాపమై కలతలు తెచ్చును. ||కోపము||

1. కోపము బంధువుల కలహములు తెచ్చును,
కోపము మైత్రిని కసిగ చెడ మార్చును,
కోపము నెయ్యమును కయ్యముగ మార్చును,
కోపమున్న వ్యక్తి కడకగు హీనము. ||కోపము||

2. కోపము బుద్ధిని మందము చేయును,
కోపము ఙ్ఞానమును కనుమరుగు చేయును,
కోపము గుండెను కస కస త్రెంచును,
కోపముతో కార్యములు సాధింప జాలము. ||కోపము||

3. కోపము జీవుని కృంగింప జేయును,
కోపము కల్గిన, మరుగును రుధిరము,
కోపముతో వడియగు రక్తప్రవాహము,
కోపముతో కల్గును మేనుపై తాపము. ||కోపము||

4. కోపమొదిలిన వ్యక్తి దైవ సమానము
కోపము తగ్గించ పెంచుము సహనము,
కోపముతో శ్రీహరి అగు నీకు దూరము,
కోపమును ప్రేమగ కొనవరకు మార్చుము. ||కోపము||

రమాకాంతరావు చాకలకొండ March 5, 2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list