పల్లవి. దయ జూపి అరుదెంచు జనార్ధన! భయములను తీర్చుము భక్త జనావన! ||దయ|| అనుపల్లవి. అభయ మిచ్చి మాకు ఆవలకు చేర్చుము, శుభకర, శ్రీకర, శ్రీ వేంకటఘన!. ||దయ|| 1. నాడు బ్రహ్మ నిన్ను వేడుకొని పిలువగ, వడి వడిగ జల చరమై చదువు లందించితివి, కొండ మూపున నిలిపి కచ్ఛప రూపమున, అండగ దరినుండి అమృతము పంచితివి. ||దయ|| 2. వరాహ, నరసింహుడవై, వటువై, రాముడవై, శ్రీరామ చంద్రుడై, కృష్ణ, బలదేవుడై, వర వేంకటేశుడవై, కలి లోన యీలీల ధరణి జనులకు రక్ష చేయ నెంచితివి. ||దయ|| రమాకాంతరావు చాకలకొండ February 16,2008 |
#maa telugu talliki mallepU daMDaa# |