Creative works from Telusuna Members

మహితాంధ్ర జాతీయత్వం

దుర్గాప్రసాదు వారణాసి

మహితాంధ్ర జాతీయత్వం

దుర్గాప్రసాదు వారణాసి
(9 మార్చి 2008)

మన జాతి మనదిరా మన ఖ్యాతి మనదిరా
మహితాంధ్ర జగతియే మనదనంగ

మన గీతి మనదిరా మన రీతి మనదిరా
మహితాంధ్ర రీతియే మనదనంగ

మన భాష మనదిరా మన బాణి మనదిరా
మహితాంధ్ర గీతమే మధుర మనగ

మనమనే భావమే మన మాన మౌనురా
మన మాన మన్నదే మనల మనగ

ఎన్ని జన్మములను యిలనందు జన్మించి
ఈ సమయముననిట నిటుల నుండు
పుణ్య భాగ్యమొందు పురుషుండ వీవంచు
తెలుసు కొనుము నిన్ను తెలుగు వాడ!



#mahitAmdhra jAtIyatvam

durgAprasAdu vAraNAsi
(9 mArci 2008)

mana jAti manadirA mana khyAti manadirA
mahitAmdhra jagatiyE manadanamga

mana gIti manadirA mana rIti manadirA
mahitAmdhra rItiyE manadanamga

mana bhAsha manadirA mana bANi manadirA
mahitAmdhra gItamE madhura managa

manamanE bhAvamE mana mAna maunurA
mana mAna mannadE manala managa

enni janmamulanu yilanamdu janmimci
I samayamunaniTa niTula numDu
puNya bhAgyamomdu purushunDa vIvamcu
telusu konumu ninnu telugu vADa!
#

Back to list