Creative works from Telusuna Members

రాము డెవరయా ? శ్రీ రాము డెవరయా ?

ఆమెరికా కోకిల

పల్లవి. రాము డెవరయా ? శ్రీ రాము డెవరయా ?
శ్యాముడు, రఘు రాముడు, పుట్టని వాడా ? ||రాము||

అనుపల్లవి. అందరూ నుతి చేయు ఆనంద రాముడు,
సుందరుడు, శ్రీకరుడు లేనే లేడా? ||రాము||

1. సింధువుపై సేతువు నిర్మించని వాడా?
అందరి ప్రియదైవము లేనే లేడా?
ఇందిర రమణుడు, ఇనకుల సోముడు,
ఆత్మ రాముడు అసలు లేనే లేడా ? ||రాము||

2. కార్య దీక్షలో కరకు నొందిన వాడు,
శూరుడు, శ్రీ రాముడు సృష్టిలోనే లేడా?
నరులలో నియతి ఉన్న ఒకే ఒక పురుషుడు,
శ్రీరాముని - యునికి మరుచుట పాడా? ||రాము||

3. కందువగ మీ ఎదలో పరికించరేమయా?
హిందువులూ! మీ గుండెలు మరగుట లేదేమయా?
డెందములో ఆవేశము పొంగులు కాదేమయా?
అందరూ తమ మదిలోన అలోచన చేయరయా? ||రాము||

ఆమెరికా కోకిల Tuesday, March 11, 2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list