భూతలములోనే బహు వన్నెలు, క్షితిజ నాధుని దివ్య శృంగార నయనములు. ||భూతలము|| 1. అతి అమర సౌభాగ్య ఆనంద ప్రదములు, యతి మునులు కోరెడి ఆదివ్య చక్షువులు, నుతి చేయ కురిపించు ఎనలేని వరములు. సద్గతుల నిచ్చెడి ఆ దివ్య చక్షువులు. ||భూతలము|| 2. సుమతులకు యివే కదా అందించు శుభములు, కామ జనకుని దివ్య కమనీయ నయనములు, జన్మ రాహిత్యము కల్గించు నివేకదా, తామసము తొలగించు తొగ కన్నులు. ||భూతలము|| 3. సిరుల నందించు యీ సుకుమార నయనములు, కరగించు కన్నులలో కమ్మిన తిమిరములు, దరి చేర్చి దయ జూపు యీ దివ్య చక్షువులు, కరి రాజునకు కూర్చె మోక్ష భాగ్యములు. ||భూతలము|| 4. అన్నమయ్యలు పొగడు ఆ శుభ నయనములు, కనుపాపలకు కూర్చు కడు దివ్య కాంతులు, ఎనలేని దయలున్న యీదివ్య చక్షువులు, అనునయముగ మనకు అందించు సౌఖ్యములు. ||భూతలము|| రమాకాంతరావు చాకలకొండ February 18, 2008 |
#maa telugu talliki mallepU daMDaa# |