Creative works from Telusuna Members

తెలుసు కొన రయ్యా! తత్వము తెలుసు కొన రయ్యా

రమాకాంతరావు చాకలకొండ

తెలుసు కొన రయ్యా! తత్వము తెలుసు కొన రయ్యా!
తెలుసు కొని మీ జీవితాలు, తరియింప జేయ రయ్యా! ||తెలుసు||

1. పంచ రంగుల రామ చిలుకు, పంచ ధాతు పంజరాన,
సంచితపు సంకెళ్ళ చిక్కి, సంతాప మొందెడి సుప్తి గతిని. ||తెలుసు||

2. ఆలు,బిడ్డలే సర్వ మనుకొని, అరు మందిని మిత్రులను కొని,
కాలుని గాలాన చిక్కి, కృంగి పోయెడి కలుష రీతిని. ||తెలుసు||

3. మనసు నెంతో చంపుకొనుచు, మమత, ప్రేమలు త్రుంచు కొనుచు,
మనిషి మోహమాయ అడసున, మునిగి పోయెడి అధోగతిని. ||తెలుసు||

4. కాంత, కనకపు లాలసందు, కన్నుగానని జీవి చివరకు, శ్రీ
కాంతుడు, శ్రీ వేంకటేశుని, శరణు గోరక, సుస్తి నొందును. ||తెలుసు||


రమాకాంతరావు చాకలకొండ February 19, 2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list