Creative works from Telusuna Members

విప్లవ శంఖం పూరించండి, పెట్లు గిల్లగ దిక్కులలో

అమెరికా కోకిల

విప్లవ శంఖం పూరించండి, పెట్లు గిల్లగ దిక్కులలో,
గొప్పగు ప్రళయం సృష్టించండి, ఘుబుల్లు మనగ గుండెలలో. || విప్లవ||

1. సమత, న్యాయం సాధించండి, సమఘాతమును సృష్టించండి
కమ్మిన మబ్బులు ఛేదించండి, కూట నీతులను కడ త్రెంచండి,
చిమ్మిన చీకటి ఛేదించండి, చీకాకులను తొలగించండి,
దమ్మును జూపి చెలరేగండి, దేశపు దుమ్మును దులిపేయండి. || విప్లవ||


2. ఆర్ధిక న్యాయం సాధించండి, అందరు ఒకటని ప్రకటించండి,
స్వార్ధ శక్తులను సమధి చేసి, సమరస భావం సాధించండి, స
మర్ధ పురుషులు సేవ గొనండి, సుస్తిర రాజ్యం స్థాపించండి,
దుర్ధర దశను తొలగించండి, ధరిత్రిలోన పేరు గొనండి. || విప్లవ||


3. కులముల పేరుతో సాగే కయ్యము, కన్నులు విప్పి నిజము గనండి, పరి
పాలకుల పదవి దాహపు, పావుగ పోరక యిక మసలండి,
కలిమిని పెంచే మార్గము నెంచి, కాయా కష్టము చేసుకొనండి,
బలిమిని పెంచి భాధ్యత తోటి, భారత దేశపు ప్రగతి గొనండి. || విప్లవ||

అమెరికా కోకిల Thursday, March 13, 2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list