Creative works from Telusuna Members

హిందువులూ! సింధువులా ఐక్యం కండి

అమెరికా కోకిల

హిందువులూ! సింధువులా ఐక్యం కండి,
అందరూ ఒక్కటిగా ముందుకు పొండి. ||హిందువులూ!||

1. ప్రతి వనిత రుద్రమాంబ, ఝాన్సి లక్ష్మిలా,
ప్రతి యువకుడు అల్లూరి సీతారామ రాజులా,
జాతి కొరకు జీవితాన్ని అర్పించండి,
రుధిరమును చిందించ ముందుకు రండి. ||హిందువులూ!||

2. జాతికి పట్టిన జాడ్యము కడిగేయండి,
నీతి, నియమాలను నెలకొల్పండి,
జాతి, కుల బేధాలు తుడిపేయండి,
మీతో యీ జగములోన సాటెవరండి. ||హిందువులూ!||

3. సాత్వికులను, సాధువులను రక్షించండి,
భాధ్యతతో బాధితులను కాపాడండి,
సేతువును తెగ నరకుట అడ్డుకొనండి,
చేతి లోని ఓటు హక్కు వాడు కొనండి. ||హిందువులూ!||

అమెరికా కోకిల Saturday, March 15, 2008



#maa telugu talliki mallepU daMDaa#

Back to list