Creative works from Telusuna Members

ఎటుల అర్చన చేతును, ఏది అర్పణ చేతును?

రమాకాంతరావు చాకలకొండ

ఎటుల అర్చన చేతును, ఏది అర్పణ చేతును?
ఏడు కొండల వాడ నీకు, ఎట్లు పూజలు చేతును. ||ఎటుల||

1. పైడి మాలలు యిత్తు నన్న, పైడి మందిర దొరవు నీవు,
పైడి నిచ్చే పాటి వాడనా, పగటు వేంకట నాయకా! ||ఎటుల||

2. రత్న హారములు లిత్తు నన్న, రత్నాకరుని పుత్రి భర్తవు,
రత్న దామము లివ్వ గలనా, శ్రీ రత్నధర శ్రీ నాయక! ||ఎటుల||

3. సిరుల సంచుల నిత్తు నన్న, సిరిని కట్టు కొన్న వాడవు
సిరుల శ్రీమంతుడా నీకు, సిరికి కొదవా శ్రీధరా? ||ఎటుల||

4. పద్మ మాలలు వేతు నన్న, పద్మావతమ్మకు పతివి నీవు,
పద్మ నాభుడ నీకు యివ్వను, పదములే యిక మేలిక. ||ఎటుల||

రమాకాంతరావు చాకలకొండ February 20, 2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list