Creative works from Telusuna Members

ఎవరు తమ్ములు, ఎవరు అక్కలు, ఎవరు నీకు బంధువుల్

రమాకాంతరావు చాకలకొండ

ఎవరు తమ్ములు, ఎవరు అక్కలు, ఎవరు నీకు బంధువుల్
ఎవరు అమ్మ, ఎవరు నాన్న, ఎవరు జీవికి ఆప్తులు? || ఎవరు ||

1. ఎచటో పుట్టి, ఎచటో పెరిగి, ఎచటో గిట్టెడి ప్రాణులు,
ఎచ్చటకు ఆపిమ్మటేగి, ఎచట ఏమగు వారలో? || ఎవరు ||

2. అచ్చమైన ప్రేమ యనుకొని, అడుసు త్రొక్కే మనుజులు,
మచ్చలేని మాన్య గతిని మెచ్చ లేరే మూర్ఖులు. || ఎవరు ||

3. తుచ్ఛమైన మోహమందు తడిసి మునిగే జీవులు,
మెచ్చి శ్రీహరి పాద యుగళము మ్రొక్కరేమి దైన్యులు. || ఎవరు ||

4. ఉచ్చులందు చిక్కిన ఉన్మత్తులు యీ మోహులు
హెచ్చు కొండల పైన వేంకని గుచ్చు కొన్నచో ధన్యులు. || ఎవరు ||

రమాకాంతరావు చాకలకొండ February 21, 2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list