Creative works from Telusuna Members

ఏమిరా యీ జీవితం, ఏమి దీని అంతరం

రమాకాంతరావు చాకలకొండ

ఏమిరా యీ జీవితం, ఏమి దీని అంతరం
సొమ్ము చేసే బూటకం, నెమ్మి లేని నాటకం. ||ఏమిర||

1. కమ్ము కొన్న మోహమందు, కుమ్ము కొనెడి ప్రాణము
నమ్మ లేని నిజము వెనుక, నరుల జీవన సమరము. ||ఏమిర||

2. ధార, పుత్రుల మేలు కొరకు, దైన్య మొందెడి జీవము, ఎ
వరు తోడు రాక ముగిసే, ఒంటరి ప్రయాణము. ||ఏమిర||

3. ఎఱుక రాని నిజము వెనుక, ఏదో దివ్య హస్తము,
నరుల జన్మలు, పుట్టు, చావులు, నిర్ణయించే తత్వము. ||ఏమిర||

4. కరిగి పోయే కాల మందు, నలిగి చావగ దేహము,
తిరుమలేసుని చేరి ఆత్మ, తృప్తి నొందుట తధ్యము. ||ఏమిర||

రమాకాంతరావు చాకలకొండ February, 22, 2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list