నిక్కము, ఒక పరి నుతించి చూడుము, ఎక్కడ లేని ఆనంద మిచ్చును. ||నిక్కము|| 1. చక్కదానికి యిది ఆలవాలము, అక్కరకు యిది అవలంబనము, ఎక్కడ పడితే అక్కడ లభ్యము, మక్కువతో నిను ముందుకు నడుపును. ||నిక్కము|| 2. దిక్కులేని తరి దగ్గరి చుట్టము, అక్కున చేర్చి ఆదరించును, సొక్కెడి వేళ శ్రమలను తీర్చును, ప్రక్కన చేరి పట్టు నిచ్చును. ||నిక్కము|| 3. గ్రక్కున దీనిని గుండెన నిలుపుము, చుక్కెదురైనచో చేవను కూర్చును, మ్రొక్కినచో యిది మోక్షము నిచ్చును, వెక్కసమగు యీ వేంకని నామము. ||నిక్కము|| రమాకాంతరావు చాకలకొండ February 23, 2008 |
#maa telugu talliki mallepU daMDaa# |