Creative works from Telusuna Members

ఏమిటో నీలీల, ఏడు కొండల వాడ

రమాకాంతరావు చాకలకొండ

ఏమిటో నీలీల, ఏడు కొండల వాడ,
ఏమని కీర్తింతు, ఎంతో చక్కని వాడ. ఏమిటో||

1. అడిగినవి ప్రేమగ అందించ వస్తావు,
అడగనివి ఎన్నెన్నో అలరించి యిస్తావు,
అడగకుండా కూడ కొసరు లందిస్తావు,
అడియస పడకుండ అన్నింట చూస్తావు. ||ఏమిటో||

2. అడుగడుగునా మమ్ము ఆదుకొంటావు
వేడుకొనగ వేగ ఉద్ధరిస్తావు,
జడివానలో చిక్క చేరువకు వస్తావు,
వడిగ మాతో నుండి వెలికి తీస్తావు. ||ఏమిటో||

3. అడుసులో కాలిడగ అదుపు చేస్తావు,
నడవడికలో నెంతో నమ్రతిస్తావు,
కడకు కనుపాపగ కాపాడుతావు, ఎ
వ్వడి తరమయ్యా ఎలుగెత్తి నిను పొగడ. ||ఏమిటో||

రమాకాంతరావు చాకలకొండ February 25, 2008



#maa telugu talliki mallepU daMDaa#

Back to list