Creative works from Telusuna Members

ఎంతచెప్పిన ఎదకు యీ మూర్ఖ మొదిలేనా?

రమాకాంతరావు చాకలకొండ

ఎంతచెప్పిన ఎదకు యీ మూర్ఖ మొదిలేనా?
ఎంత కడిగిన మదికి తామసము ఒదిలేనా? ||ఎంత||

1. వలదన్న వ్యసనములు వదిలించ నెంచెనా?
జలజ నాభుని పదము చక్కగ తల్చెనా?
తెలియ జెప్పిన ఎంతో తెలివిగా మసలెనా?
కొలచి శ్రీహరి పదము కవితలల్లేనా? ||ఎంత||

2. మంచి ఎంతో చెప్ప మనసులో నిలిపేనా?
కాంచనముపై ఆశ కొంచము వీడేనా?
సంచితపు కర్మపై సుంతము తల్చేనా?
పంచ పాతక ఫలము వినియు జడిసేనా? ||ఎంత||

3. పరతత్వ ప్రేమల ప్రభలు గాంచేనా?
గిరిధారి గుణములు గానము చేసేనా?
శిరము వంచి హరిని స్మరణ చేసేనా?
తిరు వేంకటాపతి తత్వము ఎఱిగేనా? ||ఎంత||

రమాకాంతరావు చాకలకొండ February 26,2008




#maa telugu talliki mallepU daMDaa#

Back to list