కాదన్న ఔనన్న, కొండల రాయుని, అండ ఒక్కటే, మాకు నిండు బలము, ఏది ఎవ్వరు,ఎటుల ఏరీతి పలికిన, ఏడు కొండల వాడే, మాకు వెను బలము. ||కాదన్న|| సాధనలు ఏవైన, సంపాద్య మేదైన, స్వామి శరణమే మాకు సర్వ సుఖము, ఏది సాధించిన, సాధించ కున్ననూ, శ్రీనివాసుని పదమే, మాకు వరము. ||కాదన్న|| మోదమున, దుఃఖమున, మోహనుని రూపమే, మాకు అండగ నుండి యిచ్చు స్థిరము, వేదనలు, వాదనలు, వరుసగా వచ్చినా, వాని నామమే మాకు విహిత బలము. ||కాదన్న|| శోధించగా మా చిత్తమున కిచ్చును, శ్రీనివాసుని నామ స్మరణే సుఖము, ఎదలోన శ్రీహరి వేంకటాపతి యున్న, ఎనలేని అనంద అమర సుఖము. ||కాదన్న|| రమాకాంతరావు చాకలకొండ February 27,2008 |
#maa telugu talliki mallepU daMDaa# |