వినిపించె ఎదలోన ఒక వేద మంత్రం, తనువంత పులకించి తరియించే శాంతం. ||వినిపించె|| 1. గగన సీమలో గుంఫితమై, నిగమ నియతిలో నిర్గతమై, ఆగము శాస్త్ర అలంకృతమై, నగధరుని ఆ నిర్మల నామం. ||వినిపించె|| 2. పంచ భూతముల తానై వెలసి, సంచిత కర్మలు త్రుంచెడి శరమై, పంచన చేరిన వారికి వరమగు, కాంచన మందిర కోమల నామం. ||వినిపించె|| 3. ఓంకారములో వికశితమై, శంకర, బ్రహ్మ సన్నుతమై, పంకజాశనికి ప్రియతమై, వేంకట నామమై మదిలో విరసి. ||వినిపించె|| రమాకాంతరావు చాకలకొండ February, 28 2008 |
#maa telugu talliki mallepU daMDaa# |