Creative works from Telusuna Members

వేంకటాద్రికొండలు ----> తొలకరి వానతో తడిసెను కొండలు

రమాకాంతరావు చాకలకొండ

తొలకరి వానతో తడిసెను కొండలు,
పులకరింతతో పొంగెను సరసులు. ||తొలకరి||

1. నింగిన నిండెను నల్లని మబ్బులు,
ఖంగున గర్జన చేసెను ఉరుములు,
హంగుగ రేగెను సన్నని మెరుపులు,
పొంగులు బారెను చల్లని వానలు. ||తొలకరి||

2. కిల కిల నవ్వెను కొండలు, గుహలు,
జల జల జారగ వాగులు, వంకలు,
నెలవులు తప్పెను కొమ్మలు, కోనలు,
శెలవులు పొందెను క్షితిపై మృగములు. ||తొలకరి||

3. వడి వడి వీచెను వంపుడు గాలులు,
నడుములు వూపెను వనములు, లతలు,
బిడియము వీడెను తరువులు, తీగెలు,
నడ మంత్రముగ ఆడెను నెమళ్ళు. ||తొలకరి||

4. ఝంకారములు చేసె భ్రమరములు,
ఓంకారమును పలికెను చిలుకలు,
సంకట హరునికి స్వస్తి పలికిరి,
వేంకట గిరిపై వెలసిన వేల్పలు. ||తొలకరి||

రమాకాంతరావు చాకలకొండ February 29, 2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list