Creative works from Telusuna Members

ఏది ధర్మము ? ఏది న్యాయము ? ఏది సత్య వర్తనం?

రమాకాంతరావు చాకలకొండ

ఏది ధర్మము ? ఏది న్యాయము ? ఏది సత్య వర్తనం?
ఏది యీ కలి కాలమందున, ఎనయు ధర్మ సూత్రము? ||ఏది||

1. పైకి తియ్యని మాటలు, పొంతన లేని చేష్టలు,
చక్కనైన పలుకులు, చిత్తమంత చీడలు,
ప్రేమ పొంగే బాసలు, పగటు వేషపు రీతులు,
చిక్కు వీడని జన్మలు, చిత్తమందు విషములు. ||ఏది||

2. పెక్కు నాటక రీతులు, పామరుల యీ బ్రతుకులు,
లెక్క లేని తప్పులు, లేమి నిండిన బుద్ధులు,
నిక్కి నీల్గెడి అహములు, నరుల మనసుల తలపులు,
ఎక్కు కొండల వాని నామము, తల్చ లేని జన్మలు. ||ఏది||

రమాకాంతరావు చాకలకొండ February 3, 2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list