Creative works from Telusuna Members

Telupoo Nalupoo

Durga Prasad Varanasi


తెలుపూ నలుపూ

దుర్గాప్రసాదు వారణాసి
(26 మార్చి 2008)


నల్ల రాతి బొమ్మ నారాయణుండయ్య
తిరుమలందు నుండు దేవుడతడు!
నల్లనయ్య తాను, “నల్లప్ప” (తమిళములో) తానయ్య
తెలివినెరిగి మెలగు తెలుగు వాడ!

నల్లనయ్యతండు నంద కిశోరుండు
చల్లనయ్యతండు చక్రపాణి
నల్లవాని జూడ నలుగ బోవద్దురా
తెలివినెరిగి మెలగు తెలుగు వాడ!

నల్లనైనదయ్య నడిరేయి నింగయ్య
అంతులేనియట్టి ఆకసంబు
నీల మేఘ శ్యాముడే లక్ష్మి నిలయుడయ్య
తెలివినెరిగి మెలగు తెలుగు వాడ!

తెల్ల కాగితంబు నల్లనైనది వ్రాత
పడినయంత నగును పాఠముగను
తెలుపు నలుపు కూర్మి తిరుమలేశంబయ్య
తెలివినెరిగి మెలగు తెలుగు వాడ!

పుట్టెనతడు (ఏసు క్రైస్తు) తాను పుణ్య మాతకు నాడు
“తండ్రి” తనయు డనుచు తలచి నాడు
అతని సూక్తులన్ని అతనితో నేగెనో
తెలివినెరిగి మెలగు తెలుగు వాడ!


#
telupU nalupU

durgAprasAdu vAraNAsi
(26 mArci 2008)


nalla rAti bomma nArAyaNumDayya
tirumalamdu numDu dEvuDataDu!
nallanayya tAnu, “nallappa” (tamiLamulO) tAnayya
telivinerigi melagu telugu vADa!

nallanayyatamDu namda kiSOrumDu
callanayyatamDu cakrapANi
nallavAni jooDa naluga bOvaddurA
telivinerigi melagu telugu vADa!

nallaneinadayya naDirEyi nimgayya
amtulEniyaTTi Akasambu
nIla mEgha SyAmuDE lakshmi nilayuDayya
telivinerigi melagu telugu vADa!

tella kAgitambu nallaneinadi vrAta
paDinayamta nagunu pAThamuganu
telupu nalupu koormi tirumalESambayya
telivinerigi melagu telugu vADa!

puTTenataDu (Esu kreistu) tAnu puNya mAtaku nADu
“tamDri” tanayu Danucu talaci nADu
atani sooktulanni atanitO nEgenO
telivinerigi melagu telugu vADa! #

Back to list