Creative works from Telusuna Members

పలుకవే ప్రతి క్షణము ప్రేమతో హరి యని

రమాకాంతరావు చాకలకొండ


పలుకవే ప్రతి క్షణము ప్రేమతో హరి యని,
కలువ నాభుని నుతిలో కమ్మగ మనసా! ||పలుకవే||

1. సరిగమలు సొంపుగ సరసులై పారగ,
స్వరములో రాగములు సృతితోటి పొంగగ,
శారదాంబ వీణ సొగసుగా మీటగ,
కరిరాజ వరదుని కీర్తనలు చేయవే. ||పలుకవే||

2. గిరి రాజ మనుమడు గంటమును పట్టగ,
వఱదలై కవితలు వే వేలు వెలయగ,
తఱగని భావలు తత్వమును తెలుపగ,
గిరి ధారి కీర్తనలు గొప్పగా చేయవే. ||పలుకవే||

3. సిరి నాధుడే దయతో సరసతను కూర్చగ,
వైరాగ్య గానముల వెల్లువలు నిండగ,
వర వేంకటాపతి వద్ద మది చేరగ,
తిరుమల గీతములు తియ్యగా పాడవే. ||పలుకవే||

రమాకాంతరావు చాకలకొండ January 2, 2008





#maa telugu talliki mallepU daMDaa#

Back to list