Creative works from Telusuna Members

వీనులకు విందులు నీ పైన పదములు,

రమాకాంతరావు చాకలకొండ

వీనులకు విందులు నీ పైన పదములు,
మన్నికగ అవి నిచ్చు కైవల్య పదములు. ||వీనులకు||

1. రామ! నీ నామముతో రంజిల్లు జన్మలు,
కామ, క్రోధము తృంచి కల్గించు శాంతులు,
ప్రేమ మీరగ నిన్ను పిల్చు ఆ పదములు,
శ్రమలు తప్పించెడి సోమ మంత్రములు. ||వీనులకు||

2. అనంగ జనక! నీ చరణ ఆరాధనలు,
ఆనందము నింపు, ఉప్పోంగ ఆత్మలు,
పన్నగ శయన నీ పాద పరిచర్యలు,
మన్నికగ జన్మకు యిచ్చు మోదములు. ||వీనులకు||

3. సప్తగిరివాస! నీ సంస్తుతులు, సేవలు,
ఆపదలు తొలగించి - అందించు వరములు,
తృప్తిగ నీ పద త్రిదండి కొలువులు,
ముక్తి మార్గ ప్రద మూల సోపానములు. ||వీనులకు||


పదము = వాక్యము, స్థానము సోమము = యఙ్ఞము

రమాకాంతరావు చాకలకొండ January 4, 2008#maa telugu talliki mallepU daMDaa#

Back to list