Creative works from Telusuna Members

కోరి వచ్చి మమ్ము ఏలిన కొండ

రమాకాంతరావు చాకలకొండ

కోరి వచ్చి మమ్ము ఏలిన కొండ,
దారి చూపి మమ్ము బ్రోచిన కొండ. ||కోరి||

1. సిరులు మాపై నెపుడు కురిపించు కొండ,
ధరణిలో మా పైన దయజూపు కొండ,
పేర్మిగ మము చేరి పదములు వ్రాయను,
ఏరి కోరి మమ్ము ఎంచిన కొండ. ||కోరి||

2. భూరి దానము లొసగి బ్రోచిన కొండ
శారదాంబ కృపలు సమకూర్చు కొండ,
నేర్పి పదములు మాచే వ్రాయించు కొండ,
తిరుమలాద్రి కొండ తియ్యని కొండ. ||కోరి||

3. కరుణ మాపై నెంతో కురిపించు కొండ,
శరణ మొసగి శ్రమలు తీర్చెడి కొండ,
చరణ కమలములందు చేర్చిన కొండ,
గిరి కాదు మాకిది కనగ కలకండ. ||కోరి||

రమాకాంతరావు చాకలకొండ January 5. 2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list