Creative works from Telusuna Members

సువిశాల సుందర భువి

రఘువర్మ బసవరాజు

సీ||సువిశాల సుందర భువి నిట్లు దయమాలి
దూర ఖండములుగా దుంచి నాము
స్వార్థమతిశయింప సరిహద్దులనుగీచి
దేశముల విడిగ దీర్చినాము
మనుజుల రంగు రూపుల,బుట్టుకల నెంచి
వివిధ వర్గములు గా విరచి నాము
భయ వాంఛలు దరుమ మతముల,వేల్పుల
వెలయించి మనుజులు వేరనేము!

తే.గీ|| నాది నీదని తగవేల,నెవరి యబ్బ
సొమ్ము ఘన భూతలమ్ము పంచుకొన నిటుల
నతిధు లైవచ్చినాము మూన్నాళ్ళ కిటకు
కాల ధర్మము తధ్యము గడువు దీర!


#maa telugu talliki mallepU daMDaa#

Back to list